దూర తీరాలలో ఉన్న నిన్ను చేరుకోలేక....
మనసు పడే ఈ విరహ వేదన,
ఏనాటికైనా వినిపించేనా నా ఈ మౌన ఆలాపన ....
అడుగడుగున నీతోడై ఉండాలని ఉన్నా,
ఒక నాటికి నీ నీడనైన తాకగలనా....
పొంగే నదిగా మారి నిను చేరాలని ఉన్న,
నా ఆశల తీరాలు నీ కడలి ఒడి చేరేనా ....
వికసించే పూలన్నీ నీ తలపులే తలపిస్తున్నా,
నీ ధ్యాసే నా శ్వాసగా జీవిస్తూ ఉన్నా ....
ప్రతి క్షణం నీ ఊహల్లో విహరిస్తూ ఉన్నా,
నిన్ను చేరే ఆ క్షణం కోసమై పరితపిస్తున్నా ....
- దివ్య పల్లె

No comments:
Post a Comment